అత్యుత్తమ పాఠశాలల జాబితాలో మూడు మనవే! 1 m ago
2024 సంవత్సరంలో ప్రపంచంలోనే అయిదు అత్యుత్తమ పాఠశాలల జాబితాలోకి మన దేశానికి చెందిన మూడు పాఠశాలలు చేరాయి. దిల్లీలోని రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్, మధ్యప్రదేశ్ కు చెందిన రత్లాంలోని సీఎం రైజ్ స్కూల్ వినోబా, తమిళనాడుకి చెందిన మధురైలోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ పేర్లను లండన్ కి చెందిన టీ4 ఎడ్యుకేషన్ సంస్ధ ప్రకటించింది. ఆయా పాఠశాలల యాజమాన్యాలను నవంబర్‌లో దుబాయ్‌లో జరిగే పాఠశాలల శిఖరాగ్ర సభకు ఆహ్వానించారు.